చూడటానికి స్ఫూరద్రూపం చక్కని తీరైన ముఖకవళికలు , తేజోవంతమైన కంటిచూపు నాగరికుల మధ్య అందగాడే అని చెప్పొచ్చు. కాని అతడు ఒక పిచ్చివాడు. అది అందరు ఇచ్చిన నామధేయం అతనికి.టౌనుకి దూరంగా విసిరేయబడ్డట్టు రోడ్డుకివతల ఒక కళాశాల ముందు గేట్ బైట ఆవరణలో ఒక మురికి కాలువా ప్రక్కన కూర్చుని ఉండే వాడు.చిరిగిన బట్టలు, మాసిన గడ్డం మొదటిసారి చూసిన వారికి భయం కల్పించేటట్లు ఉంటాడు. అతన్ని దీక్షగా చూస్తే అన్నీ పరిత్యజి౦చిన ఏ యోగియో కాదు కదా అనిపిస్తుంది. ఎక్కడ తినే వాడో, రాత్రంతా ఒంటరిగా , చలిలో ఎలా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండగలిగేవాడో తెలియదు.
అందరు అతని గురించి తలో రకంగా జోక్స్ వేసేవారు. ఒకరు ఆ కళాశాలలోనే చదివేవాడు అంటే బాగా చదివి అలాగైపోయాడు అని ఇంకొకళ్ళు, మరేదో సందర్భంలో ఇంకొద్ది రోజులకి ఇలా పాఠాలు చెప్పి మనము అలాగే తయారు అవుతాం అని నవ్వుకునే వాళ్ళం.ఒకోసారి బైటే కాదు లోపల కూడా పిచ్చాళ్ళు ఉన్నారని విస్సుక్కునే వాళ్ళం. కొందరికి అతడు ఏ గూఢచారో, టెర్రరిస్ట్ లాగ కనిపించేవాడు.
అతడు చిత్రంగా ఎప్పుడూ ఒక దినపత్రిక పట్టుకొని దాన్ని చదువుతున్నట్లుగా ప్రవర్తించేవాడు , ఒకోసారి ఏదో అర్ధం కాని వాక్కులలో అరుస్తూ చదివేవాడు. ఆ తరువాత ఆ పేపర్లని గోడకి అ౦టి౦చేవాడు. బహుశా అన్నం మేతుకులతో కావొచ్చు. ఇదంతా మేము రోడ్ మీద బస్ కోసం ఎదురు చూసేటప్పుడు గమనించేవాళ్ళం. మా నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఓ బ్రహ్మచారి దాదాపు రోజు అతడికి అన్నం పెడుతూ ఉండేవాడు.
అతడిని పరిశీలించినా కొలది అతని గురించి ఆలోచించేదాన్ని. ఇతను ఎలా ఈ స్థాయికి దిగజారాడు. అతని తరపు వాళ్ళు కనీసం ఒక్కరైనా లేకపోవటం ఏమిటి? పిచ్చివాళ్ళ ఆసుపత్రులు ఉన్నాయి కదా కనీసం మునిసిపాలిటి వాళ్ళు అతన్ని అక్కడికి చేర్చవచ్చు కదా అనిపించేది.
అయినా మునిసిపాలిటి వాళ్ళ బాద్యత చచ్చిన శవాలని తీసుకువెళ్ళడం, కుక్కలని , పందులని మోసుకెళ్ళడం,చెత్త చెదారం ఊడవడం మురికి కాలువలు శుభరం చెయ్యడం ఇవి కదూ వాళ్ళ సోకాల్డ్ డ్యూటీస్.
కాబట్టి అతడి మీద కంప్లైంట్ ఇస్తే ఊర్లో కుక్కలని తీసుకు వెళ్ళినట్లు తీసుకు వెళ్లేవాళ్ళేమో కాని ఆ కంప్లైంట్ ఎవరివ్వాలి కళాశాల యాజమాన్యమో , ప్రిన్సిపాలో ఇవ్వాలి. కాని వాళ్లకి అంత తీరిక , అవసరము, ప్రయోజనము ఏవి కనిపి౦చి ఉండకపోవచ్చు
అదే రోడ్డు మీద ఎన్ని జనసమూహాలు తిరిగేవి , ప్రొసేషన్స్ , కార్యకర్తలు జెండాలు ఊపుకు౦టూ నినాదాలు చేస్తూ కాని ఎవరు అతడ్ని పట్టించుకోలేదు బాట ప్రక్కన వాడిపోయిన గడ్డిపూవులా అతడు అన్నిటికి సాక్షిభూతుడై అలాగే నిస్సంగత్వమో, నిర్వేదమో మునీశ్వరుడిలా అన్ని గమని౦చేవాడు కనీసం ఆ రోడ్డున వెళ్ళే ప్రజానాయకుల దృష్టిలో పడలేదంటే మన నాయకులు ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
to be continued.................
to be continued.................
No comments:
Post a Comment