దేవుడే దిగి వచ్చి ఆ రూపంలో ఉన్నా పట్టించుకునే తీరిక అవసరం ఎవరికీ లేవు . పైగా గుడిలో ఉండాల్సిన దేవుడు ఇక్కడ ఉన్నాడేమిటి? స్థాన భ్రంశం చెందాడేమిటి? అయినా దేవుడు కదా విహారానికి వచ్చి తానే తిరిగి గుడిలోకి వెళ్ళతాడని నిశ్చయించుకుని ప్రశాంతంగా రోజులు గడిపేస్తారు.
ఎవరి స్వార్థం వాళ్ళని మాయపొరలా కమ్మేసింది. ఎవరి గోల వారిది. మా జీతం స్కేల్ పెరగలేదని ఒకళ్ళు , ప్రిన్సిపాల్ ఏదో అన్నారని ఒకళ్ళు , తరచూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు స౦ధి౦చుకు౦టూ వేరొకరిని బాధపెడుతూ తాము బాధపడుతూ కాలం వెళ్ళబుచ్చే కొందరు. ఇంట్లో పనుల దగ్గరి నుంచి కళాశాల బాధ్యతలు , బస్సులకై ఎదురుచూపులు, రోజూ ప్రయాణం ఈ చట్ట్ర౦లో ఇరుక్కున్న మా వత్తిడి పరుగుల బ్రతుకులు, హడావుడి రోజూ అతను గమనిస్తూనే ఉండేవాడు.
తీక్షణమైన అతని చూపులో చూపు కలిపి ఏ భావము లేని నిర్లిప్తమైన చూపులను చూడాలంటే భయం వేసేది . వెంటనే కనుచూపు మరల్చుకునే దాన్ని. ఒకోసారి ఎవరు పిచ్చివాళ్ళు అనే ప్రశ్న నా మదిలో ఉదయించేది. ప్రశాంతంగా నింపాదిగా ఉండే అతనికి ఎప్పుడు పరుగులు పెట్టే ప్రపంచం ఓ పిచ్చిమాలోకమే కదా.
ఒక సంవత్సరం తరువాత వరుసబెట్టి మూడు రోజులు కనిపించలేదు . ఏంటి అతను కనిపించడం లేదంటే మీకు తెలియదా మొన్న రాత్రి పాము
కాటు వేసి అతడు చనిపోయాడు అన్నారు. అది అస్సలు కారణమా అనే సందేహం కలిగింది . పాముని చూసి జాగ్రత్త పడలేని వాడు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడూ పాములు తిరుగుతుంటే ఆ ప్రదేశంలో ఎలా బ్రతక గలిగాడో అర్థం కాలేదు.
కాటు వేసి అతడు చనిపోయాడు అన్నారు. అది అస్సలు కారణమా అనే సందేహం కలిగింది . పాముని చూసి జాగ్రత్త పడలేని వాడు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడూ పాములు తిరుగుతుంటే ఆ ప్రదేశంలో ఎలా బ్రతక గలిగాడో అర్థం కాలేదు.
అప్పుడు వచ్చిందట అతని కోసం ఒక మున్సిపాలిటీ వ్యాన్ మార్చురీకి తీసుకు వెళ్ళడానికి అదీ ఎవరో కంప్లైంట్ చేస్తే. తోటి మనిషి పట్ల స్పందన
ఎలాగో ఎవరిలోనూ లేదు అతని చావులో కూడా జోక్స్ వెతికి వెకిలిగా నవ్వుకున్నాము. ఈ కళాశాల వొదిలి ఎక్కడికి వెళ్ళతాడు దెయ్యమై తిరుగుతాడని కాని మా అందరి మనసుల మాటున ఒక సన్నని భయం ప్రకంపనం ఇప్పటికీ అతని భీభత్సమైన దయనీయమైన చావుని తలచుకోగానే కలుగుతుంది.

డబ్భు , బంధువులు , అన్నిటినీ మించి మతి లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఆ స్థితికి చేరుకోవచ్చు. మనల్నికాచడానికి ఈ సమాజం ఎన్నోసోషల్ వెల్ఫేర్, యన్. జి . ఓ లు , అనాథ శరణాలయాలు ఒక మతి భ్రష్టుడిని అక్కున చేర్చుకోలేక పోయాయి. ఎయిడ్స్ రోగి నుండి వ్యభ్యచారుల వరకు ఎవరి
కైనా సహాయంగా నిలుస్తామనే సమాజం మతిహీనుల పట్ల ఇంత నిర్దయగా ఎందుకు ఉంటుందో, బహుశా కలకాలం వాళ్ళని పోషించి , కనిపెట్టుకుని ఉండాలి కాబట్టేమో.
కాని అతడు మాత్రం ఈ పిచ్చి మహా లోకం నుండి కర్మయోగిలా నిష్క్రమించాడు. ఏమో అతడే ఏ దేవుడో మారురూపంలో వచ్చిఉంటే ? అల్ పవర్ ఫుల్ అవతార పురుషులనే దేవుడని నమ్మే మనుషులం మనం. దేవుడిని మతిభ్రష్టుడిగా ఊహి౦చగలమా?
పాపులు ఎవరు? దయనీయమైన స్థితి నిజంగా ఎవరిదీ? నిజంగా మతి భ్రష్టులు ఎవరు?
తోటి మానవులకి చేయూత నివ్వలేని మన దయనీయమైన నిస్సహాయ స్థితికి అతడే బహుశా జాలిపడి తాను మాత్రం స్వచ్చంగా, స్వేచ్చగా, నిశబ్దంగా
లోకాన్ని వోదిలివెళ్ళిపోయాడు. బహుశా బుద్ధిమంతులు , నిస్వార్థులు ఉన్న లోకాలకి తరలి వెళ్ళిపోయాడేమో!
అతనికి ఏ విధంగాను సహాయపడని నా చేతకానితనానికి ఒక శిక్ష పడని నేరస్తురాలిలాగా అపరాధ భావంతో ముందుకు సాగిపోయాను.
నాలుగు రోజుల తరువాత మా కాలేజీ గేట్ ముందు ఇంకో క్రొత్త పిచ్చివాడు కనిపించాడు.దేశంలో దేనికి కరువులేనట్టే హతవిధీ ఈ పిచ్చివాళ్ళకి కూడా కరువు లేదు కదా అనిపించింది.

No comments:
Post a Comment